Happy Mother’s Day
ప్రతి తల్లి కి మా ఈ నివాళి
అవని పై అవతరించిన అద్భుతం అమ్మ ఆలంబనకు ఆసరాకు నిలిచేది అమ్మ గాయపడ్డ గొంతులోన తొలిపలుకే అమ్మ హద్దులేని మమకారానికి సరిహద్దే అమ్మ నిస్వార్ధపు ప్రేమకు నిలువుటద్దం అమ్మ చలనానికి గమనానికి దిక్సూచి అమ్మ మానవత్వ మనుగడకు మొదటి మెట్టు అమ్మ ఆందోళనతో అలసిన గుండెకు ఊరట అమ్మ వ్యక్తిత్వ వికాసానికి పునాది అమ్మ మంచి చెడులు వివరించే మొదటి గురువు అమ్మ బిడ్డ భయం పోగొట్టే బెబ్బులే అమ్మ అమ్మ అనే ఊహే ఎంతో బాగుందమ్మా అమ్మ…. అమ్మ…. అమ్మ ఇంతకన్నా గొప్ప పదం నాకు తెలియదమ్మ అట్టి అమ్మల త్యాగాన్ని గుర్తుచేసుకోమ్మ పిల్లల భవితకు జీవితాన్ని పణంగా పెట్టేదే అమ్మ దేశానికి వీరులనందించే ధీరవనిత అమ్మ గుర్తింపు కోసం ఏనాడు గళం విప్పదు అమ్మ మచ్చలేని మమతకు మచ్చు తునక అమ్మ మొక్కవోని ధైర్యానికి మైలురాయి అమ్మ అమ్మంటే మనo చూసే దేవతేనమ్మ ఇలలోని అమ్మలను చల్లంగ చూడు దుర్గమ్మ
— శ్రీనివాస్ తుమ్మల










